నూతన కోల్డ్‌ స్టోరేజ్‌ ప్రారంభం

 వినుకొండ: శావల్యాపురం మండలం వేల్పూరులో నూతనంగా నిర్మించిన శావల్యాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్‌ సుమారు రూ.6 కోట్ల 65 లక్షలతో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రం (కోల్డ్‌ స్టోరేజ్‌) ను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. బ ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, జిడిసిసి బ్యాంకు చ్కెర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, అప్కాబ్‌ చైర్మన్‌ మల్లెల ఝాన్సీ, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ కోల్డ్‌ స్టోరేజ్‌ ను నూతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా రైతులకు ఎంతో మేలని అన్నారు. రాష్ట్రం లోనే అధిక గోదాములు నిర్మించటంలో వినుకొండ 3వ స్థానం లో ఉందని ప్రశంసించారు. రైతుల కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించి, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

➡️