నూతన భవనాలు ప్రారంభం

Jan 6,2024 20:55

ప్రజాశక్తి- తెర్లాం : మండలంలోని బూరిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, ఆర్‌బికెను, ఇంటింట కుళాయిని జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాలైనప్పటికీ చక్కటి రహదారులు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటర్‌, ఇంటింటి కుళాయి వంటి సౌకర్యాలు కల్పించారన్నారు. ఎన్నికల వేల దొంగ హామీలతో మళ్ళీ ప్రజల ముందుకు పగటి వేషగాళ్ళు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నర్సుపల్లి ఉమాలక్ష్మి, మండల నాయకులు గర్భాపు రామారావు, వైస్‌ ఎంపిపి చెపేన సత్యనారాయణ, ఎఎంసీ చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు, సర్పంచ్‌ బురి మధుసూదన్‌ రావు, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️