నెమలాంలో జయహో బీసీ గర్జన

Feb 3,2024 20:52

ప్రజాశక్తి- తెర్లాం : మండలంలోని నెమలాం గ్రామంలో శుక్రవారం రాత్రి జయహో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు గ్రామంలో పర్యటించి చంద్రబాబు మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బేబినాయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. బీసీల అభివృద్ధి చెందాలంటే అది ఒక టిడిపితోనే సాధ్యమన్నారు. బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన నేతల రాము ఇటీవల కూలీ పనులు కోసం చెన్నై వలస వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మరి కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించి ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెంకటనాయుడు, వెంకటేశ్వరరావు, ఏ. సురేష్‌, జి. వెంకట్‌ నాయుడు, ఎంపిటిసిలు, సర్పంచులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.టిడిపితోనే బిసిలకు న్యాయంమెంటాడ: టిడిపి హయాంలోనే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం మెంటాడలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో బీసీలు అణచివేతకు గురయ్యారని విమర్శించారు. ఆ వర్గాన్ని జగన్‌ రెడ్డి ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విధులు లేకుండా ఉత్సవ విగ్రహాల్లా మార్చారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చలుమూరి వెంకటరావు, జి. అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి ఎర్నాయుడు, ఆర్‌.రవిశంకర్‌, ఆర్‌.సత్యనారాయణ, రామ చంద్రుడు, చిన్నం నాయుడు పాల్గొన్నారు

➡️