నేటితో ముగియనున్న చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ శ్రీ కళాజ్యోతి హ్యాండ్‌ క్రాప్ట్స్‌ వెల్ఫేర్‌ సోసైటీ వారు నగరంలోని టిటిడి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న చేనేత, హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు బుధవారంలో ముగియ నున్నట్లు సోసైటీ కార్యదర్శి వెంకయ్య తెలిపారు. మంగళవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటలవరకు ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత వస్త్రలు హైదరాబాద్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌ శారీస్‌, బెంగాలి కాటన్‌, మంగళగిరి నారా యణపేట, దర్మవరం, పోచంపల్లి, మధ్యప్రదేశ్‌, టస్కర్‌, భాగలపూరి స్కిల్‌ చీరలు, లక్నో చెకెన్‌ చీరలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డ్రస్‌ మెటీరియల్‌ కలకారి, మంగళగిరి, చీరాల, పోచంపల్లి, నారాయణపేట, నారాయణవనం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హస్తకళా వస్తువులు, హైదరాబాద్‌ ముత్యాలు, ఆభరణాలు, గోల్డ్‌ కవరింగ్‌ ఆభర ణాలు, కొండపల్లి, ఏటికోప్పాక చెక్కబొమ్మలు, వుడ్‌ కార్వింగ్‌, సారంగపూర్‌ వుడ్‌ ఐటమ్స్‌, జైపూర్‌ పెయిం టింగ్స్‌, తిరుపూర్‌ గార్మెంట్స్‌, లాక్‌బాంగిల్స్‌, హెర్బల్‌ పౌడర్స్‌, కెస్‌మెదురు, వెట్‌మెటల్స్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మెటల్‌ బొమ్మలున్నాయన్నారు.

➡️