నేడు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

Mar 26,2024 21:23

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సుయాత్ర ష ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి సార్వత్రిక ఎన్నికల శంఖరావాన్ని మోగించింది. వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు ‘మేమంతా సిద్ధం’ సభల పేరిట బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని వేంపల్లి, వీరపనాయునిపల్లి, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, నంద్యాల జిల్లా మీదుగా ఆళ్లగడ్డ వరకు బస్సుయాత్ర సాగనుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల వారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రొద్దుటూరులో ‘మేమంతా సిద్ధం’ సభను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మల మడుగు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీ కరణకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజులుగా జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ మొదలుకుని 36 మండలాలు, తొమ్మిది మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు మొదలుకుని మండలాల నాయకత్వాలకు జనసమీకరణ బాధ్యతలను అప్పగించారు. ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్న నేప థ్యంలో టిడిపి నుంచి భారీగా చేరికలకు అవకాశం ఉంది. ప్రొద్దుటూరు, కమలా పురం, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని టిడిపికి చెందిన నాయకులు సహా మైనార్టీ నాయకులు చేరికలకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

➡️