నేడు సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాక

Dec 7,2023 21:09
సిఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డి

నేడు సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాకప్రజాశక్తి -కోట కోట మండలంలోని విద్యానగర్‌ ప్రాంగణలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రానున్నారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం తుఫాను పర్యటన నేపథ్యంలో ఆయన వస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం సమీపంలో స్వర్ణముఖి వంతెన వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ముందస్తుగా జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో బాలిరెడ్డి పాలెంలో వంతెన వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. మొట్టమొదటిగా విద్యానగర్‌ హెలిప్యాడ్‌ వద్ద చేరి అనంతరం రోడ్డు మార్గంలో బాలిరెడ్డిపాలెంకు సీఎం కాన్వారు ద్వారా చేరుకుంటారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో హడావుడిగా హెలిప్యాడ్‌ నిర్మాణ పనులు, హెలిప్యాడ్‌ చుట్టూ పరిసర ప్రాంతాలలో పోలీసుల డాగ్‌ స్క్వాడ్‌ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా విద్యానగర్లోని కాలేజ్‌ రోడ్డు మీదుగా గాంధీ బొమ్మ వద్ద రోడ్డు మార్గమంతా స్థానిక పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది ద్వారా పరిశుభ్రత వాతావరణన్ని తీసుకొచ్చారు. ఆయనతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ, గూడూరు ఆర్డీవో కిరణ్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు.సిఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డి

➡️