నేను లోకల్‌!

ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకల పర్వం కొనసాగుతూనే ఉంది. 2023 డిసెంబర్‌లో జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక, కేన్సర్‌ కేర్‌్‌, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని 14 కేటగిరీలకు చెందిన 196 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల యంత్రాంగం పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా మొదట రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టు పెట్టకుండా సెలెక్షన్‌ లిస్టు ప్రకటించడంపై ఆందోళన నెలకొనడం, రిజర్వేషన్ల గుర్తింపు దగ్గర నుంచి, ఆయా పోస్టులకు అర్హతలు నిర్ధారించడంలో విఫలం కావడంతో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డిప్యూటీ సిఎం స్పందించడంతో కలెక్టర్‌ మరోసారి సర్టిఫికెట్ల పరిశీలన, రిజర్వేషన్‌ అర్హతల నిర్ధారణకు పలువురు జిల్లా ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులోనూ కేన్సర్‌ కేర్‌ విభాగానికి సంబంధించిన రెండు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఇద్దరు స్థానిక జిజిహెచ్‌లోని బ్లడ్‌బ్యాంకు సహచర ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మెరిట్‌ మార్కులు కలిగిన అభ్యర్థికి డిఎంహెచ్‌ఒ ఇచ్చిన సర్టిఫికెట్‌లో కాంపొనెంట్‌ అనే పదం లేదనే పేరుతో నిరాకరించడం గమనార్హం. ఇందులో తక్కువ మార్కులు కలిగిన ఓ రిజర్వేషన్‌ కేటగిరీకి చెందిన ఓ ఉద్యోగిని ఓపెన్‌ కేటగిరీలో సెలెక్షన్‌ లిస్టుకు ఎంపిక చేశారు. ఎస్‌సి కేటగిరీ పోస్టును వేకెంట్‌గా చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో స్థానిక జిజి హచ్‌లో విధులు నిర్వహిస్తున్న ఫిజియోథెరపిస్ట్‌కు సర్వీస్‌ మార్కులు కలపకుండా సెలెక్షన్‌ లిస్టులో మొండి చేయి చూపించడం గమనార్హం. ఇంతటితో ఆగకుండా పులి వెందుల మెడికల్‌ కళాశాలకు చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ దర ఖాస్తుదారు నాన్‌లోకల్‌ కేటగిరీ అయితే లోకల్‌ కేటగిరీ కింద ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో సదరు యువ కుడు తేరుకుని సర్టిఫికెట్లు అందజేయడానికి ఆలస్యంగా జిఎంసి చుట్టూ చక్కర్లు కొడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. కలెక్టర్‌ నియమించిన జిల్లా ఉన్న తాధికారుల బృందం సర్టిఫికెట్లు వెర్ఫికేషన్‌, రిజర్వేషన్‌ తదితర అంశాల ఆధారంగా పరిశీలించి రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టులోనూ అవకతవకలు కొనసాగడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆ ముగ్గురితోనే అవకతవకలు?కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియలో ఫైనల్‌ లిస్టులో ఓ ల్యాబ్‌ టెక్నీషి యన్‌, సూపరింటెండెంట్‌ సహా మరో ఉద్యోగి కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇందులోని ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ బ్లడ్‌ బ్యాంకు టెక్నీషియన్‌ పోస్టుకు మార్కులను ఒకరికి కలపడం, మరొకరికి కలపకపోవడం, రిజర్వేషన్‌ కేటగి రీలను సైతం మార్చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎస్‌సి కేటగిరీ అభ్యర్థికి ఓసి కేటగిరీ పోస్టుకు ఎంపిక చేయడం, ఎస్‌సి కేటగిరీ పోస్టును వేకెంట్‌గా చూపించ డమేమిటనే విమర్శ వినిపి స్తోంది. వీరికి జిఎంసి ప్రిన్సిపాల్‌ వంత పాడటం విస్మయాన్ని కలిగిస్తోంది.గ్రీవెన్స్‌ను అడ్రెస్‌ చేయండి కాంట్రాక్టు పోస్టుల భర్తీలో ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న గ్రీవెన్స్‌ను పరిష్కరించిన తరువాత సెలెక్షన్‌ లిస్టు పెట్టాలి. కేన్సర్‌కేర్‌ విభాగంలోని ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టు దరఖాస్తుదారుకు డిఎంహెచ్‌ఒ జారీ చేసిన సర్టి ఫికెట్‌లో కాంప్లెక్స్‌ అనే పదం లేదనే పేరుతో నిరాకరించడం దారుణం. తాజాగా డిఎంహెచ్‌ఓ ఇచ్చిన సర్టిఫికెట్‌ అర్హమైనదైతే పరిశీలించాలి. సదరు వేకెంట్‌ పోస్టును భర్తీ చేయాలి. సర్వీసు మార్కులు కలపకుండానే జిజిహెచ్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌కు మొండిచేయి చూపించడం తగదు.-బి.మనోహర్‌, జిజిహెచ్‌ మెడికల్‌ యూనియన్‌ నాయకులు, కడప.

➡️