నోడల్‌ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి 2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో నోడల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు, ఎన్నికల సమయంలో చేపట్టా ల్సిన వివిధ కార్యకలాపాలను సమర్థ వంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో నోడల్‌ అధికారులను నియమించామన్నారు. త్వరలో వచ్చే సాధారణ ఎన్నికలను ఎలాంటి అవాం తరాలు లేకుండ నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఆయా అంశాలలో నోడల్‌ అధికారులకు విధులను కేటాయించడం జరిగిందని బాధ్యతాయుతంగా విధులను నిర్వహించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. అధికారు లందరూ ఎన్నికల సంఘం జారీ చేసే సూచనలకు అనుగుణంగా 2024 శాసనసభ, పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి ద్వారా కేటాయించబడిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిం చాలన్నారు. అధికారులందరూ ఎన్నికల సమయంలో సందర్భానుసారం నిర్వర్తిం చాల్సిన విధులు, చేపట్టాల్సిన పనులు, ప్రక్రియలకు సంబంధించి ఎన్నికల సంఘం ద్వారా జారీ చేయబడిన మాన్యువల్లు, హ్యాండ్‌బుక్‌లు, సర్క్యులర్‌లను క్షుణ?ంగా చదివి అవగాహన కలిగించుకోవాలన్నారు. ఎన్నికల నియమాలు, విధానాలతో ఇప్పటి నుంచే తమను తాము సన్నద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్‌లను ఈసిఐ వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా, నిష్పక్షపాతంగా చేయడానికి నియోజకవర్గ ఇఆర్‌ఒలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కోరారు. నియమించబడిన నోడల్‌ అధికారులందరూ వారికి కేటాయించిన సబ్జెక్టుకు సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు సమర్పించాలని తెలియజేశారు. నోడల్‌ అధికారులందరినీ జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారని, ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసు కోవాలన్నారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించడం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని, అమలులో ఉన్న ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్య తీసుకోబడుతుందన్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత షెడ్యూల్‌ ప్రకారం ప్రణాళిక బద్ధంగా పనిచేసే ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అడిషనల్‌ ఎస్‌పి రాజ్‌కమల్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ రావు, నియోజకవర్గ ఇఆర్‌ఒలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️