పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

ప్రజాశక్తి-కనిగిరి: తుపాను కారణంగా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న మిర్చి, మినుము పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి పంట నష్టపరిహారం అందేలా వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని డిమాండ్‌ చేశారు. కరువు కాలంలో చేసిన పరిశీలన ప్రకారం రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు, నాయకులు ఏడుకొండలు, ఎస్‌కే బషీరా, శాంతకుమారి పాల్గొన్నారు.

➡️