పంటలు పరిశీలన

ప్రజాశక్తి- రాచర్ల : మండల పరిధిలోని అనుములపల్లె, సత్యవోలు, రాచర్ల, గుడిమెట్ట రైతు భరోసా కేంద్రాల పరిధిలో 2023-24లో రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలను గిద్దలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు డి.బాలాజీ నాయక్‌ సోమవారం పరిశీలించారు. పంట నమోదు సూపర్‌ చెకింగ్‌లో భాగంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం పొలాల్లో సాగు చేసిన పంటలను నిశితంగా పరిశీలించారు. మండలంలో 50 ఎకరాల్లో సాగు చేసిన ఆముదం పంట పరిశీలించి రైతులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఒ షేక్‌ అబ్దుల్‌ రఫీక్‌, గ్రామ వ్యవసాయకులు లలిత, శ్రీలక్ష్మి, నందిని, నబి యూనస్‌, రైతులు పాల్గొన్నారు.

➡️