నీట్‌ ఫలితాలపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలి

ప్రజాశక్తి- కడప అర్బన్‌
నీట్‌ పరీక్ష 2024 ఫలితాలు నీట్‌ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రులు నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున నీట్‌ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం కడపలో ఆర్ట్స్‌ జూనియర్‌ కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సగిలి రాజేంద్రప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌ మాట్లాడుతూ దేశం మొత్తం నీట్‌ పరీక్షలో జరిగిన అక్ర మాలపై గల వ్యక్తి స్పందిస్తుంటే కానీ రాష్ట్రంలో దానికి భిన్నంగా అధికార టిడిపి, జనసేన, ప్రతిపక్ష వైసిపి పార్టీ ఏమాత్రం నోరు మెదపకపోవడం దారు ణం అన్నారు. నీట్‌ పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు. 2024 నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున పారదర్శకత పరీక్ష నిర్వ హణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. నీట్‌ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం ఉన్న ఒకే సీరియల్‌ నెంబర్లతో కూడిన ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. నీట్‌ పరీక్ష రద్దుచేసి అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు విజరు, అంజి,వినరు,చరణ్‌ పాల్గొన్నారు.

➡️