పండుగ మీకు…పస్తులు మాకా..?

Jan 16,2024 22:49
అంగన్‌వాడీలు రాష్ట్ర

ప్రజాశక్తి – కాకినాడ

‘పండగ మీకు..పస్తులు మాకా’ అంటూ అంగన్‌వాడీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని అంగన్‌వాడీలు నిలదీశారు. పండుక కానుకలు ఇస్తానని నమ్మించిన జగన్‌ తమను పండుగ రోజున కూడా సమ్మెలో కూర్చోబెట్టావు అంటూ నినదించారు. కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద మంగళవారం అంగన్‌వాడీలు 36వ రోజు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, ఉపాధ్యక్షులు కె.సత్తిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అంగన్‌వాడీల ఉద్యమం రాబోయే కాలంలో చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. రోజురోజుకీ అంగన్‌వాడీలకు రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించనిపక్షంలో ప్రజా సునామీలో జగన్‌ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం తెలంగాణ కంటే ఎక్కువ జీతం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుడు లోవరాజు సంఘీభావం తెలియచేస్తూ పాటలు పాడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణలతోపాటు అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం. రమణమ్మ, టి. నీరజ, సరోజనీ, రమ, ఆయేషా, రమాదేవి, మున్నీ, విజయ, జోగమ్మ, అప్పలకొండ, శ్రీదేవి, పద్మ, వేపారమ్మ, అన్నపూర్ణ, రాజేశ్వరి, లక్ష్మి, తనూజ, చామంతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరప సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షను కొనసాగిం చారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్‌ సెక్టర్‌ నాయకురాలు పి.వీరవేణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మహిళల పట్ల కక్ష సాధింపుగా వ్యవహరిం చడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవ కుమారి, అచ్చారత్నం, కల్పలత, హెల్పర్‌ సత్యా మాధవి, ఎం.భవాని, నారాయణమ్మ, మంగతాయారు, సరోజినీ, జ్యోతి, పి.లక్ష్మి, ఎ.దేవి, బి.మనోజ, లక్ష్మి,సాయి దుర్గ, బి.భవాని, తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌ లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలు ధర్నాను కొనసాగించారు. ఈ సమ్మె శిబిరాన్ని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఒ.అప్పారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌, సూరిబాబు, యూనియన్‌ నాయకులు దాడి బేబీ, అమల, ఎస్తేరురాణి, టిఎల్‌ పద్మావతి, లోవతల్లి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, భవాని, పద్మ, దేవి, తులసి, జె కుమారి, సత్యనారాయణమ్మ, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.ఏలేశ్వరం స్థానికంగా జరుగుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు తమ రిలే నిరహారదీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత, ఎన్‌.అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి జె.రాణి, పి.నూకరత్నం, ఆర్‌.రత్న కుమారి, పి.దుర్గాసూర్యకుమారి, కె.రమ్య, పి. గంగా భవాని, కె.బంగారుపాప, బి.కృపావతి పాల్గొన్నారు.

➡️