ప్రజారోగ్య వ్యవస్థ పనితీరును పరిశీలన

Jan 9,2024 15:19 #East Godavari

ప్రజాశక్తి చాగల్లు (తూర్పుగోదావరి) : ప్రజారోగ్య వ్యవస్థ పనితీరును నేరుగా పరిశీలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ ప్రత్యేక బృందం మంగళవారం చాగల్లు మండలంలో ఇందిరమ్మ కాలనీలో తనిఖీ నిర్వహించారు. డిపిఎమ్‌ఓ డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా గణాంక అధికారి జే కుమారస్వామి, డిపిహెచ్‌ఎన్‌ఓ వసంత లక్ష్మి, డిపిఓ సంధ్యారెడ్డి, డేటా మేనేజర్‌ ఎస్‌ రామకష్ణతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు గర్భిణీ స్త్రీలకు ప్రజలకు బాలింతలకు పలు రకాలైన వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో రికార్డులను నిషితముగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పలు రకాలైన వైద్య ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయి అని ఆరా తీశారు. విద్యార్థులు, గర్భిణీలు, మాతా శిశు సంరక్షణ, కార్డులను, చిన్న పిల్లల టీకాల రికార్డులు తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ టి మనోజ్‌, పి హెచ్‌ ఎన్‌ షేక్‌ జమీల, హెల్త్‌ సూపర్వైజర్‌, ఏఎన్‌ఎంలు ఆశాలు పాల్గొన్నారు.

➡️