పట్టణ అభివద్ధి, సుందరీకరణే ధ్యేయం : ‘గడికోట’

ప్రజాశక్తి రాయచోటి రాయచోటి పట్టణ అభివద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని గుణ్ణికుంట్ల రహదారి మార్గంలో రింగ్‌ రోడ్డు-పెమ్మాడపల్లె చేరువుకట్ట వరకు నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలకుకు అమర్చిన ఎల్‌ఇడి స్ట్రీట్‌ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని గుణ్ణికుంట్ల రహదారి మార్గంలో రహదారిని సుందరంగా విస్తరణ చేయడంతో పాటు నూతనంగా విద్యుత్‌ స్తంభాలుకు ఎల్‌ఇడి వీధి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఎల్‌ఇడి స్ట్రీట్‌ లైట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన కూడళ్ల సుందరీకరణతో పట్టణ అభివద్ధికి మరో ముందడుగు పడిందన్నారు. పట్టణంలో అభివద్ధి పనులతో పాటు కూడళ్లలో సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. గుణ్ణికుంట్ల రింగ్‌ రోడ్డు సర్కిల్‌, చిత్తూరు రహదారి మార్గంలోని సర్కిల్‌, నేతాజీ సర్కిల్‌, మాసాపేట-వేంపల్లె సర్కిల్‌ లలో సుందరీకరణ పనులు ముగింపుదశకు చేరుకున్నాయన్నారు. ఎస్‌ఎన్‌ కాలనీలో టవర్‌ క్లాక్‌ నిర్మాణం, దిబ్బలబడి సర్కిల్‌, షాదీ ఖానా వద్ద అబ్దుల్‌ కలాం విగ్రహం వద్ద సుందరీకరణ నిర్మాణాలు త్వరలో ప్రారంభమవు తాయన్నారు. చెన్నముక్కపల్లె రింగ్‌ రోడ్డు నుంచి ఠాణా వరకు సెంట్రల్‌ లైటింగ్‌ను త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొలిమి హారూన్‌, షబ్బీర్‌, ఫయాజ్‌ అహమ్మద్‌, నవాజ్‌, ఆర్ట్స్‌ శంకర్‌, జిలాన్‌ పాల్గొన్నారు.

➡️