పట్టుబడిన ద్విచక్ర వాహనాల దొంగ

Jan 29,2024 20:30

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పట్టుకున్నట్లు వన్‌ టౌన్‌ డిఎస్‌పి కె.గోవిందరావు తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్‌పి మాట్లాడారు. ఇటీవల బైక్‌ దొంగతనాలు పెరిగాయని, దీంతో వన్‌టౌన్‌ టీంతో స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఒక వ్యక్తి (మైనర్‌ బాలుడు)ని అనుమాన స్థితిలో పట్టుకున్నట్లు తెలిపారు. మరొక బాలుడి సాయంతో ఈ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. 12 బైకులు దొంగతనం చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. తిరుపతయ్య పాలెంలో దుప్పాడ దుర్గాప్రసాద్‌ ఈ బైకులు డిస్పోజలు చేస్తున్నట్లు తేలిందన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ లో పాల్గొన్న వన్‌ టౌన్‌ సిఐ వెంకట్రావు , ఎస్‌ఐ తార్కేశ్వరరావు, సిబ్బందిని డిఎస్‌పి అభినందించారు.

➡️