పత్తి గోదాములో మంటలు

Jan 31,2024 00:30

ప్రజాశక్తి – క్రోసూరు : మండల కేంద్రమైన క్రోసూరులోని పోలీస్‌స్టేషన్‌ దారిలో ఉన్న ఓ పత్తి గోదాములో మంగళవారం మంటలు రేగి అందులోని పత్తి పంట దగ్ధమైంది. దీంతోపాటు పక్కనే ఉన్న పాత సామాన్లు కూడా కాలిపోయాయి. ప్రమాద స్థలికి క్రోసూరు, పెదకూరపాడు నుండి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఇన్‌ఛార్జి ఆఫీసర్‌ ఎన్‌.సుబ్బారావు ఆధ్వర్యంలో 14 మంది సిబ్బంది మంటలను అదుపు చేశారు. షేక్‌ పెదకూరపాడు సైదా నివాసం వద్ద పత్తి గోడౌను, పాత సామాన్లు గోడౌన్లు 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తాజా ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా? లేదా అంత్యక్రియల సందర్భంగా పేల్చిన బాణసంచా వల్ల జరిగిందా? అనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రమాదంలో రూ.18 లక్షల పత్తి, రూ.2 లక్షల సామాను, మొత్తంగా రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు గోడౌన్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

➡️