పదిరోజుల్లో పేదలకు టిడ్కో ఇళ్లు అందజేత

Feb 26,2024 21:46

ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్‌ : మండలంలోని అడ్డాపుశీలలో రూ.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న టిడ్కో గృహాలను మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకు అందజేయనున్నట్టు ఎమ్మెల్యే అలజంగి జోగారావు, రాష్ట్ర టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ 16 బ్లాకుల్లో 768 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయన్నారు. మార్చి మొదటి వారంలో సుమారు 300 పైచిలుకు పూర్తి చేసిన ఇళ్లతో పాటు మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా మిగతా మౌలిక సదుపాయాలను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గణ్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ గొర్లి మాధవరావు, వివిధ వార్డుల కౌన్సిలర్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎఎంసి డైరెక్టర్లు, స్టేట్‌ డైరెక్టర్లు, జిల్లా పార్టీ ప్రతినిధులు, సచివాలయం కన్వీనర్లు, వైసిపి సీనియర్‌ నాయకులు, మున్సిపల్‌ కమిషనర్‌, టైట్కో డిపార్ట్మెంట్‌ ఈఈ, ఏడి, ఏఈ లతో పాటు సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️