‘పది’ పరీక్ష కేంద్రాల్లో డివైఇఒ తనిఖీ

ప్రజాశక్తి-నిమ్మనపల్లి మండలంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను మదనపల్లి డివైఇఒ శ్రీరామ్‌ పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా జరు గుతున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేస ినట్లు వివరించారు. అందులో భాగంగానే బుధవారం నిమ్మనపల్లి మండలం లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (తెలుగు)లో, జిల్లా పరిషత్‌ ఉర్దూ పార Äశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. బుధ వారం జరిగిన సోషియల్‌ పరీక్షకు రెండు కేంద్రాలలో 344 మంది విద్యా ర్థులకు గాను 317 మంది విద్యార్థులు హాజరు కాగా, 27 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఒకేషనల్‌ పరీక్షలు మినహా పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయని వివరించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్నం భోజనం ద్వారా నాణ్యమైన భోజనం, యూనిఫామ్‌ బట్టలు, పుస్తకాలను ఉచితంగా అందిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు.

➡️