పనిభారం తగ్గించాలి : సిఐటియు

Dec 15,2023 21:19

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అన్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జయమ్మ, మెహరున్నీసా ఆధ్వ ర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 36 గంటల నిరసన కార్యక్రమం శుక్రవారం విజయ వంతంగా ముగిసింది. ఈ సందర్బంగా ఆయన మాటా ్లడుతూ ఆశా వర్కర్లకు సమస్యలు పెరుగు తున్నాయి, పనిభారం పెరుగుతోందన్నారు. ప్రభుత్వం వారి సమస్యలు పట్ల నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఆశా వర్కర్లకి సంబంధంలేని పనులు చేయిం చరాదని తెలిపారు. రాజకీయ జోక్యం ఆపాలని, విధి నిర్వహణలో మరణించినా కుటుంబాలకు ఆశా వర్కర్‌ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలాని డిమాండ్‌మ చేశారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయ డ్యూటీలు ఆశా వర్కర్లతో చేయిం చరాదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలన్నారు. ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ముంతాజ్‌, ఉపా ధ్యక్షులు పి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఆశలకు ఇచ్చిన ఫోన్స్‌ పని చేయటం లేదన్నారు. జిల్లాలో అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, సచివాలయంతో సంబంధం లేకపోయినా సాయంత్రం 5 వరకు సచివా లయంలో ఉండాలని అంటున్నారని తెలిపారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర ఆశావర్కర్ల పోరాటాలలో భాగస్వా ములవుతామని సంఘీభావం తెలిపారు. మెటర్నటి సెలవులు సమస్యలు పరిష్కారం వరకు జరుగు తున్న 36 గంటల ధర్నా చేస్తున్న అధికారులు స్పందించక పోవడంతో ఒక్కసారిగా ఆశాలను కలెక ్టరేట్‌లోకి దూసుకెల్లారు. సిఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో భారీగా పోలీసులు అడ్డుకున్నారు. ఆశాలు తీవ్ర ప్రతిఘటనతో కలెక్టర్‌ కార్యాలయం వరకు వెల్లారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెసికి అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, ఆశా జిల్లా గౌరవ అధ్యక్షుడు పి. శ్రీనివాసులు, వెంకట్రామయ్య, ఆశాలు నీలావతి, లావణ్య, రమాదేవి, నాగరత్నమ్మ, నాయకులు ఫామిదా, సుధారాణి, నాగేశ్వరి, సునంద, రమాదేవి, సత్యవాణి, సంగీత, రోజా, జహరాబి పాల్గొన్నారు.

➡️