పరిశోధనలో నూతన పద్ధతులు అవలంబించాలి

Mar 6,2024 19:36

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్‌
ప్రజాశక్తి – ఎఎన్‌యు :
ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగంలో నూతన మెలకువలు, నూతన పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ సూచించారు. ‘అడ్వాన్స్డ్‌ రీసెర్చ్‌ మెథడాలజీ’ అంశంపై వర్సిటీ విద్యా విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల జాతీయస్థాయి వర్క్‌షాప్‌ బుధవారం ప్రారంభమైంది. ప్రారంభ సభలో విసి రాజశేఖర్‌ మాట్లాడుతూ పరిశోధనలో ఎక్స్‌పెరిమెంటల్‌ పద్ధతులను వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. పరిశోధన ఫలితాలు సమాజాభివృద్ధికి, మానవాభ్యున్నతికి దోహదపడాలని సూచించారు. ద్రవిడ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస కుమార్‌ కీలకోపన్యాసం చేస్తూ పరిశోధన పద్ధతుల్లో ప్రధానంగా శాంపిలింగ్‌ మెథడ్‌ వినియోగించాలని సూచించారు. వర్క్‌షాపు ఉద్దేశాన్ని డైరెక్టర్‌ డాక్టర్‌ పి.బ్రహ్మాజీరావు వివరించారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌.స్వరూపారాణి, విద్యా విభాగం చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జె.ఆర్‌.ప్రియదర్శిని, ప్రొఫెసర్లు ఎ.చంద్రమోహన్‌, బి.పద్మనాభయ్య, వి.లాజర్‌, టి.షారోన్‌ రాజు, వి.రవి, కె.సుమలత, డాక్టర్‌ జి.చక్రవర్తి, డాక్టర్‌ జె.సూరజ్‌ మోహన్‌, వర్క్‌ షాప్‌ నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ ఎం.వసంతరావు, సభ్యులు డాక్టర్‌ టి.సందీప్‌ పాల్గొన్నారు.

➡️