పరీక్ష సామగ్రి పంపిణీ

Mar 17,2024 21:40
ఫొటో : పది విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేస్తున్న అధికారులు

ఫొటో : పది విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేస్తున్న అధికారులు
పరీక్ష సామగ్రి పంపిణీ
ప్రజాశక్తి-కోవూరు : పదవ తగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమని, ఈ సమయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రధానంగా సమయం పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానోపాధ్యాయురాలు నరసింహమూర్తి తెలిపారు. కోవూరులోని పచ్చిపాల రామనాధమ్మ జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల సమావేశ మందిరంలో ఆదివారం సాంఘిక సంక్షేమ బిసి పసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 201 నుండి పెద్ద ప్రభావతి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా పరీక్షలకు సంబంధించి మెటీరియల్‌, ఫ్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించాలనే పట్టుదలతో ముందురు సాగినప్పుడే ఫలితాలు మీ వెంటనే ఉంటాయన్నారు. ఇప్పటికే ఈ ట్రస్టు ద్వారా నిర్వాహకులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. ట్రస్టు నిర్వహరులు పెద్ద మారుతి నాగార్జున, పెద్ద సత్యవతిలు వదన తరగతి విద్యార్థులకు ఇటంవంటి మంచి కార్యక్రమాలు చేపట్టడంపై వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎఎస్‌డబ్ల్యూ తిరుపతయ్య మాట్లాడతూ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు మానూరుశాతం ఫలితాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ట్రస్టు నిర్వాహకులు ఇటువంటి నుంచి కార్యక్రమం చేపట్టడం విద్యార్థులకు మరింత ధైర్యాన్ని అందించిందన్నారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు. మండల విద్యాశాఖ అధికారి రహీమ్‌ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, దాతల సహకారంతో ఇటువంటి మంది కార్యక్రమాలను తరచుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ట్రస్టు నిర్వాహకులు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినదిదనీయమని, దానిని నిరంతరం కొనసాగించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారులు వెంకట్రావు, పద్దు, సుప్రజ, జ్యోతిరాణి, తదితరులున్నారు. అనంతరం ట్రస్టు నిర్వాహకులు పెద్ది మారుతీ నాగార్జున, పెద్ది సత్యవతి, పెద్ది హితేష్‌ను సంక్షేమ శాఖ అధికారులు శాలువా పూలమాలతో సత్కరించి సన్మానం చేశారు.

➡️