పర్యావరణంపై అవగాహన

Dec 20,2023 21:34
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
పర్యావరణంపై అవగాహన
ప్రజాశక్తి-బిట్రగుంట:పర్యావరణ నెట్‌వర్క్‌ సహకారంతో అక్షయ ఉమెన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధ్యక్షురాలు జి.బాలశైలజ ఆధ్వర్యంలో బోగోలు మండలం విఎన్‌ఆర్‌ పేటలోని అక్షయ ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది పూర్‌ పీపుల్స్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ చేవూరు చిన్న ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్‌ వాడకం నిషేధించాలన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాల వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదని ఆయన తెలిపారు. జెడ్‌పి బార్సు స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ మనిషి రోజువారీ కార్యకలాపాలలో బ్యాగులు ముఖ్యమైన వస్తువులు, అందువల్ల వాటి నిరంతర కంటే ప్లాస్టిక్‌ సంచులు ఆధికంగా ఉపయోగిస్తున్నారని, వీటిని అరికట్టాలని ఆయన అన్నారు. సంస్థ అధ్యక్షురాలు జి.బాల శైలజ మాట్లాడుతూ జీవిత చక్రంలో పర్యావరణంపై వాటి ప్రభావాన్ని హైలెట్‌ చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యామ్నాయాలను ఏర్పరచుకోవాలని ప్లాస్టిక్‌ సంచులు కాగితపు సంచులు, టోట్‌ బ్యాగ్‌లు, జనపనార సంచులు,ఉన్ని సంచులు అధోకరణం చెందే ప్లాస్టిక్‌ సంచుల రూపంలో వినియోగించాలని ఆమె తెలిపారు, కార్యక్రమంలో శ్రీనివాసులు, జీ.రమణ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️