‘పల్లె పిలుస్తుందిరా’ విజయవంతం చేయాలి

Jan 13,2024 20:16

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : రాష్ట్రం బాగు కోసం ప్రతి ఒక్కరికీ చంద్రబాబు పాలన ఆవశ్యకత, అవసరం గురించి గ్రామాలలో ప్రజలకు వివరించడమే పల్లె పిలుస్తోంది రా కార్యక్రమం ఉద్దేశం అని మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. శనివారం ఈ మేరకు తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటూ సంక్రాంతి పండగకి పల్లెకు చేరుకున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పడం, ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోవడం సంక్రాతి పండగకి బయట నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి తప్పకుండ ఎలక్షన్‌కు ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోలా వెంకట్రావు, గుంట్రెడ్డి రవికుమార్‌, రవికుమార్‌, బంకపల్లి రవి, హనుమంత్‌ శంకర్‌, బంకపల్లి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : పల్లె పిలుస్తోంది రా గోడ పత్రికను కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరి శనివారం గుమ్మలక్ష్మీపురంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటూ సంక్రాంతి పండగకి పల్లెకు చేరుకున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు కలిగి ఉన్నారో లేదో చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రొఫెషనల్‌ వింగ్‌ నియోజకవర్గ అధ్యక్షులు గొర్లె కిషోర్‌, అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు జె.వి రమణ, అరకు కార్యదర్శి కార్తీక్‌ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, నాయకులు రామారావు, రాజేష్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

➡️