పల్స్‌పోలియో నిర్వహణపై అవగాహన

Feb 26,2024 21:36
ఫొటో : మాట్లాడుతున్న ఆరోగ్య వైద్యాధికారిణి అనూష

ఫొటో : మాట్లాడుతున్న ఆరోగ్య వైద్యాధికారిణి అనూష
పల్స్‌పోలియో నిర్వహణపై అవగాహన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో సోమవారం పల్స్‌పోలియో నిర్వహణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిమలూరు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి అనూష మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పల్స్‌ పోలియోకు సంబంధించిన 61 బూత్‌లు మార్చి 3, 4, 5 తేదీలలో ఆత్మకూరు రూరల్‌ (మహిమలూరు), ఆత్మకూరు అర్బన్‌లో ఏర్పాటు చేస్తామని, అందులో 2 ట్రాన్సిట్‌ బూత్‌లు (ఆత్మకూరు డిపో, ఎంజిఆర్‌ బస్టాండ్‌), 2 మొబైల్‌ బూత్‌లు ఉంటాయన్నారు. రి మైనింగ్‌ బూత్‌లు పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో ఏర్పటు చేస్తామన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాల పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, టీకా పిల్లలకి ఎలా వేయాలన్న జాగ్రత్తల గురించి మహిమలూరు పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ అనూష వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అనూష, డాక్టర్‌ అస్మా, ఎంఇఒలు నజీర్‌, చలపతి, ఎసిడిపిఒ సునీలత, ఎంపిహెచ్‌ఇఒ సుధాకర్‌, ఎంపిహెచ్‌ఎస్‌ (ఎం) సయ్యద్‌, ఎంపిహెచ్‌ఎస్‌ (ఎఫ్‌) బి.పార్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

➡️