పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి

బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌, తదితరులు

పల్నాడు జిల్లా: పశువుల ఆరోగ్య సంరక్షణ దష్ట్యా పశు పోషకులు గాలి కుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గాలికుంటు వ్యాధి టీకాల బ్రోచర్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గాలికుంటు టీకాల కార్యక్రమం, జాతీయ పశు వ్యాధి నివారణ కార్య కమం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంద న్నారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖా సంచాలకులు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని లక్ష్యం మేరకు టీకాలు వేయా లన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాలి కుంటు టీకాల నిర్వహణకు సంబంధించి జిల్లా పర్యవేక్షణ కేంద్రానికి చైర్మన్‌ తాను, జిల్లా పశుసంవర్ధక శాఖా సంచాల కులు కన్వీనర్‌గా, నరసరావుపేట నియోజకవర్గ పశు సంవర్ధక శాఖా ఉప సంచాలకులు, సహాయ సంచాలకుల సభ్యులుగా వ్యవహరిస్తామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌,అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌,పారా వెటర్నరీ సిబ్బంది, సచివాలయ పశు సంవర్ధక సహాయకులు సలహాలు సూచ నలు చేశారు.

➡️