పాఠశాలకు పుస్తకాల వితరణ

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు పీజీఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 950 గ్రంథాలయ పుస్తకాలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రామారావు అధ్యక్షత వహిం చారు. దాతలు ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవడం ఎంతో గొప్పతనమని కొనియాడారు. పీజీఎన్‌ఎఫ్‌ అధినేతలు డాక్టర్‌ కొర్రపాటి సుధాకర్‌, రిటైర్డ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యం, సైన్స్‌ ఉపాధ్యాయులు వై సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో విలువైన గ్రంథాలను పాఠశాలలకు తమ సంస్థ ద్వారా అందిస్తున్నామని, విద్యార్థులు పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, తద్వారా విజ్ఞానవం తులుగా తయారు కావాలని కోరారు. భవిష్యత్‌లో మంచి సౌకర్యాలను కలుగచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఘనంగా సత్కరించారు.

➡️