పాఠశాలకు వితరణ

Jan 31,2024 21:48
వితరణ అందజేస్తున్న దాత

వితరణ అందజేస్తున్న దాత
పాఠశాలకు వితరణ
ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని కొండి కందుకూరు (జ) మండల పరిషత్‌ పాఠశాలలో ఆ గ్రామ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కావలి జవహర్‌ భారతి కాలేజ్‌ ప్రిన్సిపల్‌ గా పనిచేస్తున్న డాక్టర్‌ రాయి మాల్యాద్రి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ. 50,000 బ్యాంక్‌ డిపాజిట్‌ చేశారు. వాటితో వచ్చే వడ్డీతో ప్రతిసంవత్సరం రిపబ్లిక్‌ డే దినోత్సవం రోజున పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తక సామాగ్రిని అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ స్వగ్రామానికి ఏదో ఒక సాయం చేయాలని ఉద్ధేశ్యంతో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ న్నారు. సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య దాత మాల్యాద్రికి గ్రామం తరపున అబి óనందనలు తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు ప్రసాద్‌, సుబ్బారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు సూర్యనారాయణ రావు, కరేటి వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ప్రభావతి, గ్రామపెద్దలు, విశ్రాంత వార్డెన్‌ బివి, సీనియర్‌ ఉపాధ్యాయులు మోహనరావు, బి కోటేశ్వరరావు, గుమ్మా శ్రీను, గేరా చిరంజీవి .ప్రభాకర్‌ పాల్గొన్నారు. అనంతరం దాత అయిన రాయి మాల్యాద్రి, ఇరువురు మండల విద్యాధికారులను, సర్పంచ్‌, పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు.

➡️