పాఠశాల వార్షికోత్సవంలో డిప్యూటీ సిఎం డ్యాన్స్‌

Feb 11,2024 20:35

 ప్రజాశక్తి-సాలూరు  : పట్టణంలోని ఆర్‌సిఎం హైస్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం రాజన్నదొర విద్యార్ధులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో భాగంగా తొలుత డిప్యూటీ సీఎం రాజన్నదొర, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్‌ పర్సన్‌ జర్జాపు దీప్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్ధులు లుంగీ డాన్స్‌, లుంగీ డాన్స్‌ అనే పాటకు నృత్యం చేశారు. ఉత్సాహం ఆపుకోలేక విద్యార్ధులతో కలిసి ఆయన కూడా స్టెప్పులేశారు. దీంతో విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేశారు. కార్యక్రమంలో టౌన్‌ సిఐ జిడి బాబు, ప్రముఖులు హాజరయ్యారు.13న నడుకూరులో జగనన్న ఆరోగ్య సురక్షప్రజాశక్తి – వీరఘట్టంమండలంలోని నడుకూరులో ఈనెల 13న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపిడిఒ ఎస్‌.సాల్మన్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వైద్య , సచివాలయ సిబ్బంది సమయం పాటించి విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

➡️