పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు : కమిషనర్‌

Dec 7,2023 00:01 #కమిషనర్‌

ఒంగోలు సబర్బన్‌ : మిచౌంగ్‌ తుపాను కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలలో చేరిన వర్షపునీటిని బయటకు పంపి, పారిశుధ్యాన్ని మెరుగు పరించేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు.తుపాను కారణంగా వర్షం నీరు నిలిచిన కాలనీలు, నీటి పారుదల లేనిడ్రెయినేజీలను బుధవారం పరిశీలించారు. అనంతరం పద్మాలయ బేకరి వద్ద కాలువలో చేపట్టిన పూడిక తీత పనులను పర్యవేక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ కాలనీ, గోపాలనగర్‌, శ్రీనివాస మహల్‌ ప్రాంతంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. చేశారు.

➡️