పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలి

Feb 26,2024 21:31
ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు
పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : పట్టణంలో జనాభా పెరుగుతున్నందున కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలిసినందున ఆ మేరకు పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌డిఒ శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో జనాభా పెరుగుతున్నందున అంతేకాకుండా ముసునూరు, బుడంగుంట, మద్దూరుపాడు, గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసినందున ఆమెరకు సరిపడా పారిశుధ్య కార్మికులు లేరని గతంలో ఉన్న కార్మికులే ఇప్పుడు ఉన్నారని అంతేకాకుండా ఉన్నవారిలో కొంతమంది చనిపోవడం, రిటైర్డ్‌ అయిపోవడం, జరుగుతున్నందున కార్మికుల ఖాళీలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దానివల్ల తోటి కార్మికులపై పనిభారం పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు ఇబ్బందులు పడకుండా పట్టణ అవసరాల మేరకు పారిశుధ్య కార్మికులను పెంచాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏర్పడిన కార్మికుల ఖాళీలలో కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తక్కువ జీతాలతో పనులు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న డైలీ కార్మికులను నియమించాలని కోరారు. అంతేకాకుండా పట్టణంలో ఇంకా తగినంత మంది పారిశుధ్య కార్మికులను నియమించి పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. కార్మికులను పెంచేంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, ఎం.పోలయ్య, క్రాంతికుమార్‌, ఒంగోలు రమేష్‌, కె.బాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️