పారిశ్రామిక శిక్షణను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే

Jan 30,2024 21:18

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : గిరిజన విద్యార్థులు పారిశ్రామిక విద్యపై ఆసక్తి కనబరిస్తే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వీలుంటుంది కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని భద్రగిరి ఆర్‌ఐటిఐలో ప్లంబర్‌ ల్యాబ్‌ను ఆమె మంగళవారం ప్రారంభించారు. స్థానికంగా ఉంటూ చదువుకోవడానికి సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్లంబర్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం ప్రిన్సిపల్‌ సిహెచ్‌ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ కమల్‌ వెల్ఫేర్‌ స్వచ్ఛంద సేవా సంస్థ (విశాఖపట్నం) సహకారంతో రూ.ఐదు లక్షలతో ఎపి ఎస్‌ ఎస్‌ డి సి కోఆర్డినేటర్‌ శ్రీ సాయి ప్లంబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కావున యువత ప్లంబర్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పార్కు ప్రారంభంమన్య ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మండలంలోని ఎస్‌ కె పాడు సమీపాన నిర్మించిన అడ్వెంచర్‌ పార్క్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ పార్కు పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తుందన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా గడపడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌, ఎంపిపి దీనమయ్య, జడ్పిటిసి రాధిక, వైస్‌ ఎంపిపి నిమ్మక శేఖర్‌, సర్పంచులు ఆర్‌.చైతన్య స్రవంతి, గౌరీ శంకర్రావు, అధికారులు పాల్గొన్నారు.

➡️