పార్టీని వీడితే నష్టమేమీ లేదు : ఎమ్మెల్యే బొత్స

Mar 21,2024 20:34

 ప్రజాశక్తి-గజపతినగరం :  కొందరు డబ్బులకు, పదవులకు ఆశపడి పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. ఏ ఒక్కరు పార్టీని వీడినా ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా స్థానిక నాయకులు కషి చేయాలన్నారు.. రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. గురువారం స్థానిక బెల్లాన కన్వెన్షన్‌ లో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల ముఖ్య నాయకులతో విస్తృ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఖాయం అనే అలసత్వం వహించవద్దని, ప్రతి ఒక్కరూ శ్రమించాలని అన్నారు. గ్రామాల్లో నాయకులు మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తేనే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జగన్మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మన గెలుపునకు బలమైన పునాదిగా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చిన బూతులపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీలో కొత్తగా చేరే వారిని వ్యతిరేకించవద్దని, ఎవరు స్థానం వారికి ఉంటుందని హితబోధ చేశారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ, మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు తమ శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు బొత్స సాయి గురు నాయుడు, జెడ్‌పిటిసిసభ్యులుగార తౌడు, రౌతు రాజేశ్వరి, ఎంపిపి సింహాద్రి అప్పలనాయుడు, మాజీ ఎంపిపి కంది తిరుపతి నాయుడు, మాజీ జెడ్‌పిటిసి మంత్రి అప్పలనాయుడు, ఎఎంసి చైర్మన్‌ వేమలి ముత్యాల నాయుడు, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి నారాయణ మూర్తి రాజు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, నాయకులు కరణం ఆదినారాయణ, మండల సురేష్‌, బెల్లాన త్రినాధరావు, కృష్ణార్జులు తదితరులు పాల్గొన్నారు.

➡️