పిహెచ్‌సిల్లో రోగులకు మెరుగైన వైద్యం

ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రాజవొమ్మంగి, అడ్డతీగల

ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి, జడ్డంగి, అడ్డతీగల మండలం ఎల్లవరం పిహెచ్‌సిలను శనివారం పిఒ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిహెచ్‌సిల్లో అన్ని గదులు, వార్డులు, మందుల స్టోర్‌ రూమ్‌లను పరిశీలించారు. ఏవిధంగా వైద్య సేవలు అందుతున్నది ఆస్పత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏయే వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయో పరిశీలించి, ఎప్పటికప్పుడు వివిధ రకాలైన మందులు అందుబాటులో పెట్టుకోవాలని వైద్యులకు సూచించారు. ఆయా ఆసుపత్రుల్లో గర్భిణులు ఎంతమంది ఉన్నది ఆరా తీశారు. వేసవి కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెట్టాలని వైద్యులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జిప్రకాశం, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️