పిహెచ్‌సి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి – చాపాడుపిహెచ్‌సి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజరురామరాజు, ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామంలో రూ.2.48 కోట్లతో నిర్మించిన నూతన పిహెచ్‌సి భవనాలను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేందుకు ప్రతి మండలానికి రెండు పిహెచ్‌సిలు ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా నక్కలదిన్నె గ్రామానికి నూతన పిహెచ్‌సి మంజూరైందన్నారు. ఇప్పటికే ఇద్దరు వైద్యులను, సిబ్బందిని నియమించామన్నారు. అన్ని రకాల వసతులతో పిహెచ్‌సిని నిర్మిం చామన్నారు. ఇంకా అవసరమైన సామగ్రి, ఇతర చిన్నపాటి సమస్యలను వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పిహెచ్‌సి నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా అందజేసిన పశ్చిమగోదావరి జాయింట్‌ కలెక్టర్‌ రామ సుందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, వైసిపి నియోజకవర్గ సమన్వ యకర్త నాగిరెడ్డి, ఎంపిపి టి.లక్ష్ముమయ్య, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీమన్నా రాయణరెడ్డి, జిల్లా వైద్యాధికారి నాగరాజు, ఆర్‌అండ్‌బి ఎస్‌సి పి.మహే శ్వర్‌రెడ్డి, ఇఇ డివి నరసింహారెడ్డి, డిఇ కంబగిరి, తహశీల్దార్‌ భూషణం, ఎంపిడిఒ మహబూబ్‌ బీ, ఈఓపీఆర్డీ రాధాకృష్ణవేణి, ఎఇ దాదాబాషా, వైద్య ఆరోగ్యశాఖ ఎపిడమాలజిస్ట్‌ ఖాజా మొహిద్దిన్‌, కాంట్రాక్టర్‌ పాణ్యం నాగమణిరెడ్డి, సంఘన హరినాథ్‌ రెడ్డి, జడ్పిటిసి భర్త శాంతరాజు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ మల్లేష్‌, వైద్యులు రాజేష్‌ కుమార్‌, శ్రీవాణి, కావ్య మాధురి, ఓబులేష్‌, మాజీ కెసి కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్‌ సోముల మహేశ్వర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.బాలవేమారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మండలంలోని పెద్దగురువలూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు సింగిల్‌విండో చైర్మన్‌ పాలగిరి వేమారెడ్డి సోదరుడు బాల వేమారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నాగిరెడ్డి పరామర్శిం చారు. ప్రమాదం జరిగిన తీరు, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపిపి టి.లక్షుమయ్య, వెంకటరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

➡️