పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

Dec 6,2023 23:11 #amaravati, #rajakumari, #rdo

అమరావతి: మండల కేంద్రం లోని బండచేను, కాలచక్ర కాలనీ నీటి ప్రవా హంలో మునిగి పోవడంతో స్థానిక తహశీల్దార్‌ ఆధ్వర్యంలో పలోటి కాలే జీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం ఆర్డిఓ రాజ కుమారి పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. 52 గుడిసెలలో 156 మంది స్త్రీ,పురుషులను మరో ఇద్దరూ గర్బిణుల పునరావాస కేంద్రానికి తరలించినట్లు తహశీల్దార్‌ విజయ శ్రీ తెలిపారు. స్థానిక ఎంపీటీసీ ఆలా వెంకట రాజ్యలక్ష్మి వారికి భోజన సౌకర్యాలు కల్పించారు. వైద్యు లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని, మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని సూచించారు.

➡️