పులి వెంకటరెడ్డికి నివాళి

ప్రజాశక్తి-కనిగిరి : కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి 23వ వర్ధంతి కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పులి వెంకటరెడ్డి పార్కులో ెంకటరెడ్డి మనవరాలు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, గోవర్ధన్‌ రెడ్డి దంపతులు, పులి లక్ష్మి , 17వ వార్డు కౌన్సిలర్‌ దేవకి రాజీవ్‌ తదితరులు వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పులి వెంకటరెడ్డి వెలిగండ్ల సమితి ప్రెసిడెంట్‌ గా. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్‌ సభ్యునిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ప్రధానంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి ఎంతోగానే కృషి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పులి నాగేంద్ర,రుద్ర,సందాని, పాచ్చు, మన్సూర్‌, భారత్‌ గ్యాస్‌ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️