పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపితేనే అందరికీ సమాన అవకాశాలు

Feb 27,2024 23:36

అతిథులను సత్కరిస్తున్న వీసీ పి.రాజశేఖర్‌ తదితరులు
ప్రజాశక్తి – ఎఎన్‌యు :
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘మార్జినాలిటీ అండ్‌ మల్టీ కల్చరల్‌ లిటరరీ నేటివ్‌ ఆస్ట్రేలియా అండ్‌ ఇండియా’ అంశంపై రెండ్రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పలువురు ప్రొఫెసర్లు, ఆన్లైన్‌ ద్వారా మరి కొందరు ప్రసంగించారు. ముందుగా ప్రొఫెసర్‌ సిడియోల్‌ ఫ్రాంక్‌ హెచ్‌. దీన మాట్లాడుతూ సమాజంలో వివక్ష రూపుమాపడానికి ప్రేమ, విలువ, వ్యవస్థ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంలో కరీబియన్‌ డియా స్పోరిక్‌ను ఉద్దేశించి ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ప్రొఫెసర్‌ పాల్‌ శరద్‌ తాను రాసిన ఏ షార్ట్‌ హిస్టరీ ఆఫ్‌ ఆస్ట్రేలియన్‌ లిటరేచర్‌ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. బ్లాక్‌ డయాస్పోరిక్‌ సంక్షోభం నేపథ్యంలో సాధ్యాయన యోగ సూత్రం యొక్క సాంస్కృతిక, సామాజిక చిక్కులను ప్రొఫెసర్‌ షమీం వివరించారు. డాక్టర్‌ క్రిస్టియన్‌ మాట్లాడుతూ విలియమ్స్‌ ఆస్ట్రేలియాలో దక్షిణాసియా డయాస్పరిక్‌ సాహిత్యాన్ని అన్వేషించిన ఆయన దాని ప్రాముఖ్యత వెలుగునిస్తుందని అన్నారు. న్యూయార్క్‌కు చెందిన ప్రొఫెసర్‌ నికోలస్‌ బిర్న్స్‌ మాట్లాడుతూ సాంస్కృతికతపై పెట్టుబడిదారీ విధానం, వలసవాద ప్రభావం తీవ్రంగా ఉంటుంద న్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని తగ్గించి నప్పుడే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయన్నారు. ప్రొఫెసర్‌ రాజేష్‌ కర్నకల్‌ మాట్లాడుతూ దళిత సాహిత్యాన్ని సంప్రదాయ సాహిత్య సిద్ధాంతాల ద్వారా అంచనా వేయలేమన్నారు. అయితే ఈ అవగాహనలో ఒక నమూనా మార్పును అందజేస్తుందని చెప్పారు. ఇండియాకు చెందిన ప్రొఫెసర్‌ సుజా కురుప్‌ మాట్లాడుతూ బహుళ సాంస్కృతికత ప్రపంచీకరణ యొక్క పర్యాయపదాలను వివరించారు. ప్రొఫెసర్‌ వైఎస్‌ శరత్‌ మాట్లాడుతూ హిజ్రా గుర్తింపు సాహిత్యంపై వెలుగునిస్తుందన్నారు. అట్టడుగు వర్గాలను బాగా అర్థం చేసుకోవడానికి ఈ సాహిత్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ వి.నిర్మల అనువాద రచన ఫైర్‌ ఫ్లైస్‌ పై విమర్శనాత్మక సమీక్షను వివరించారు. సదస్సు డైరెక్టర్‌ అయిన ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ సదస్సులో పాల్గొన్న కీనోట్‌ స్పీకర్లను సత్కరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ, అగ్రవర్ణాల ప్రభావం తగ్గినప్పుడే సామాన్యులు కూడా సమానత్వంలోకి వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సదస్సులో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ, ఇంగ్లీష్‌ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్‌ జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు.

➡️