పెట్రోల్‌ పోసుకొని యువకుడు ఆత్మహత్యా యత్నం

Dec 6,2023 23:59 #పోలీసులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. యర్రగొండపాలెంనకు చెందిన మోజేష్‌ అనే యువకుడిని ఓ కేసు విషయమై పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇది అవమానంగా భావించిన మోజేష్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పి క్షతగాత్రుడిని యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్‌ను మట్టడించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

➡️