పేదలకు అండగా ఉండే సిపిఎంను గెలిపించండి

Mar 26,2024 21:56

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గిరిజనులు, దళి తులు రైతులు, వృత్తిదారుల పక్షాన, ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసే సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలం లోని గొరడలోని గిరిజనులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు ఓటేసి చట్టసభలకు పంపించాలని కోరారు. గిరిజనులకు కష్టం, నష్టం వచ్చినా అండగా నిలబడే పార్టీ ఒకే ఒక్క సిపిఎం పార్టీ అని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ మాట్లాడుతూ రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేసి బాండ్లు పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన బిజెపిని, రాష్ట్రంలో దాన్ని బలపరుస్తున్న టిడిపి, జనసేన వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా నీడలోనే గిరిజనులకు రక్షణ ఉంటుందన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్ధ రాజకీయాల కోసం నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే గిరిజనుల హక్కులు, చట్టాలను కాపాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు, కె.గంగునాయుడు తదితరులు మాట్లాడారు.

➡️