‘పేదలకు మెరుగైన వైద్య సేవలు’

ప్రజాశక్తి-పీలేరు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పీలేరు, కెవి పల్లి మండలాల వైసిపి బాధ్యులు పెద్దిరెడ్డి సుధీర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. కంభంవారిపల్లె మండలం, వగళ్ళ గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష-2 వైద్య శిబిరాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా నేనున్నానని భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో పెద్దఎత్తున ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు గ్రామాల్లో పర్యటించి మధుమేహం, రక్తపోటు, కంటి వైద్య పరీక్షలతో పాటు అనేక ఇతర సేవలు అందజే శారన్నారు. శిబిరంలో 406 మంది చికిత్స పొందినట్లు గర్నిమిట్ట ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ రేష్మ తెలియజేశారు. వారిలో ఇద్దరిని పైస్థాయి వైద్యం కోసం రెఫర్‌ చేసినట్లు తెలియజేశారు. కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్‌ రెడ్డికాంతమ్మ, జడ్‌పిటిసి గజ్జెల శతిరెడ్డి, ఎంపిటిసి లక్ష్మీదేవి, మండల సచివాలయాల కన్వీనర్‌ సతీష్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి జయరామ చంద్రయ్య, వగళ్ళ సచివాలయ కన్వీనర్‌ ఖాదర్‌ బాష, స్థానిక నాయకులు రామకొండారెడ్డి, వెంకట సిద్ధులు, రఘు నాధరెడ్డి, గజ్జెల శీనురెడ్డి, మల్లికార్జున, ఎంపిడిఒ యాదవేంద్ర, స్పెషలిస్ట్‌ వైద్యులు శ్రీనివాస నాయక్‌ ఆప్మా మాలిక్‌ ఆఫీసర్‌ బాబు, సామాజిక ఆరోగ్య అధికారిణి భాగ్యలక్ష్మి, గ్రామ కార్యదర్శి దీపిక పాల్గొన్నారు.

➡️