పేదలకు విద్యను దూరం చేయొద్దుఎస్‌ఎఫ్‌ఐ

Dec 19,2023 21:29
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌

పేదలకు విద్యను దూరం చేయొద్దుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో వక్తలుప్రజాశక్తి – క్యాంపస్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని వినాశకరం వైపు తీసుకెళుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌ అన్నారు. విద్యార్థిలోకం వినాశకర విద్యా విధానాన్ని ముక్తకంఠంతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా మహాసభ వేమన విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభసభలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యారంగంలో బడ్జెట్‌ను పెంచడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వింతగా ఏ రాష్ట్రం అమలు చేయకుండానే తానున్నానంటూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతబడి, పేదలకు విద్య దూరం అవుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకూ కనుమరుగవుతోందన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి మాధవక్రిష్ణ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు అక్బర్‌, అశోక్‌, హరిత, సహాయ కార్యదర్శులు హరి, తేజ, రవి,ప్రసాద్‌, పవన్‌ పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌

➡️