పేదల చెంతకే వైద్య సేవలు

Mar 6,2024 22:06
ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు
పేదల చెంతకే వైద్య సేవలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : పేదల చెంతకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారని వైసిపి నాయకులు తాతపూడి అభిసలం అన్నారు. బుధవారం మండలంలోని వేంపాడు గ్రామంలో రెండోవిడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు పాల్గొని 370మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండో విడతలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వెంకటకృష్ణ కుమారి, సర్పంచ్‌ విజయమ్మ, వైద్యులు ఆయేస, వైసిపి నాయకులు మల్లికార్జున, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️