పేదల జీవితాల్లో వెలుగే థ్యేయం: ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. తన ఆధ్వర్యంలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించగా విశేష స్పందన లభించింది. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం జరిగింది. జననీ చారిటబుల్‌ ట్రస్ట్‌, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో మొత్తం 306 మంది పాల్గొన్నారు. వారందరికీ బీపీ, షుగర్‌ పరీక్షలతో పాటు కంటి వైద్య పరీక్షలు చేశారు. కంటి సమస్యలతో ఉన్నవారికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు రుతూజ పాటిల్‌, సోనాలి బెహ్రా కంటి పరీక్షలు చేసి అవసరం అయిన 165 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఆపరేషన్‌కు ఎంపికైన వారిలో మొదటి విడతగా ఆదివారమే 50 మందిని పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి ఉగ్రనరసింహారెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. మిగిలినవారు ఈనెల 12న 60 మంది, 13వ తేదీ 65 మంది ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. క్యాంపునకు వచ్చిన వృద్ధులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నాయకులు పరామర్శించారు. ఐటీడీపీ కో-ఆర్డినేటర్లు మార్నేని రామకృష్ణ, మద్దిశెట్టి రమాదేవి, మువ్వ రంగసాయి, కూడలి రోశయ్య, నారపరెడ్డి వెంకటరెడ్డి, ఖాజా హనుమంతరావు, నాగరాజు, రాజా, దశరథ, బ్రహ్మయ్య, శరత్‌, మధు, మహేంద్ర, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️