పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెమకాయమ్మ, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పోతవరం, తానా, చింతల గ్రామాలలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలో వైసిపి చేసిన అభివద్ధి కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వైసిపి అభిమానులు. నాయకులు శాలువాలతో వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కోరే సుబ్బారావు, కోరే రంగసాయిబాబు, ఒంటేరు మల్లికార్జున, వెంకటశివ, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️