పేదల సొంతింటి కల సాకారం : కలెక్టర్‌

ప్రజాశక్తి-కడప పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ విధానం వల్ల లక్షలాది మంది పేదలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు తెలిపారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్‌పిఐ లబ్దిదారులకు తొలి దఫా వడ్డీ రీయింబ ర్స్‌మెంట్‌ మొత్తాన్ని బటన్‌ నొక్కి వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ విసి హాలు నుండి కలెక్టర్‌ వి.విజరు రామరాజు తోపాటు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ డి.సుధా, రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజమ్‌, రాష్ట్ర ఉద్యాన సలహాదారు పి.శివ ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర పిఆర్‌ అండ్‌ ఆర్డీ సాల హాదారు నాగార్జునరెడ్డి, జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం జిల్లాలోని 33,046 మంది ఎస్‌హెచ్‌జి హౌసింగ్‌ లబ్దిదారులకు మంజూరైన రూ.3,33,18,590 మొదటి దశ రుణ రాయితీ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో కలెక్టర్‌ అతిధులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని పేదింటి మహిళలకు వారి సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపడుతున్న విధానాలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌, డిఆర్‌డిఎ, మెప్మా పీడీలు కృష్ణయ్య, ఆనంద్‌ నాయక్‌, సురేష్‌ రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి సరస్వతి, అధికారులు పాల్గొన్నారు.

➡️