పేదింటి పెద్ద కొడుకు సిఎం జగన్‌ :’గడికోట’

ప్రజాశక్తి-రామాపురం పేదింటి పెద్దకొడుకు సిఎం జగన్‌ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. మాజీ ఎంపిపి గడికోట జనార్జనరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అవ్వా తాతలకు రాసిన లేఖను శ్రీకాంత్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిసందెలో ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సిఎం అండగా నిలుస్తున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకరు చవిపోతే కానీ మరోకరికి పింఛన్‌ ఇచ్చేవారు కాదని తెలిపారు. వైఎస్‌ఆర్‌ సాచురేషన్‌ పద్ధతిలో అర్హులైన వారందరికీ పింఛన్‌లను మంజూరు చేశారన్నారు. జగన్మో హన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి రూ.250 నేటికి రూ.3వేలు పెంచి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాష్ట్రంలో 39 లక్షల పింఛన్‌ దారులకు రూ.400 కోట్లు మాత్రమే అందించేవారని, వైసిపి పాలనలో 66.34 లక్షల మందికి పెన్ష న్లను ఇస్తున్నామని, నెలకు రూ.1900కోట్లు పింఛన్‌ రూపంలో అంది స్తున్నారన్నారు. మండలంలో నాలుగు వేలకు నూతన పక్కా గహాలు ను మంజూరు చేయించామని తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగ పెన్షన్ల పెంపు నూతన పెన్షన్లు అందు తుండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ రెస్కో చైర్మన్‌ కష్ణారెడ్డి, జడ్‌పిటిసి మాసన వెంకట రమణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కర్ణపు విశ్వనాధరెడ్డి, వైస్‌ ఎంపిపిలు, రవి శంకర్‌రెడ్డి, బాబు, సింగల్‌ విండో అధ్యక్షులు పెద్దిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వడ్డెర కార్పోరేషన్‌ డైరెక్టర్‌ ఆంజ నేయులు, సర్పంచ్‌లు నాగభూషన్‌ రెడ్డి, వెంకటరెడ్డి, మునీర్‌, ముక్కోటి బసిరెడ్డి, ఆంజనేయులు, యశోధమ్మ, ఖాదర్‌వలీ పాల్గొన్నారు.పుల్లంపేట :ఎంపిడిఒ కార్యాలయంలో రూ.3వేలు ఫించన్‌ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హాయంలో అర్హత ఉన్నా పింఛన్‌ రావాలంటే నరకంగా ఉండేదని, నేడు అటువంటి పరిస్థితి లేదని అర్హుల ఇంటి వద్దకే పింఛన్‌ అందిస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. దేశంలో మూడు వేలు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఓబులవారిపల్లె మండలానికి 6799 మంది పింఛన్‌దారులకు రూ.1.80 కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పెంచిన పింఛన్‌ను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సాయికిషోర్‌రెడ్డి, ఎంపిపి చెర్ల నాగమ్మ, వైస్‌ ఎంపిపి సుమిత్ర, సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్‌ తల్లెం భరత్‌ కుమార్‌రెడ్డి, ఎంపిటిసి రోహిణి, కుమార్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️