పేరుకే ఏరియా ఆసుపత్రి ఇంకా 30 పడకలే?

Feb 1,2024 21:30

ప్రజాశక్తి – సీతంపేట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిని వంద పడకలుగా అప్‌గ్రేడ్‌ చేస్తే మరింత ఎక్కువ మందికి వైద్యం అందించాలని ఉద్దేశంతో అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు భావించారు. ఈమేరకు30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా 2021లో అప్‌ గ్రేడ్‌ అయింది. అయితే ఇప్పటికే 30 పడకలతోనే కొనసాగుతుంది. వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి సుమారు రూ.19 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అపార్ట్మెంట్‌ మేడ పైన రెండు బ్లాకులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఒక్క బ్లాక్‌ మాత్రమే నిర్మించారు. ఆసుపత్రిలో బెడ్లు చాలీ చాలక సీజన్లో ఒక బెడ్‌పై ఇద్దరికి చొప్పున వైద్యం అందించాల్సిన అవసరం కూడా వస్తుంది. స్థానిక ఏరియా ఆసుపత్రిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, ఒడిశా నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు . ప్రస్తుతం ఒపి 200 వస్తుంది. సీజన్లో అయితే 350 పైగా పెరుగుతుంది. దీనివల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఒక్కొక్క గదిలో నలుగురు వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు రోగులకు ఇటు వైద్యాధికారులకు అవస్థలు తప్పడం లేదు. వెంటాడుతున్న సమస్యలునాలుగు ఆపరేషన్‌ థియేటర్లు ఉండాల్సి ఉండగా, మూడే ఉన్నాయి. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఏరియా ఆసుపత్రికి ప్రత్యేకంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అవసరం ఉ ంది. అది లేకపోవడంతో నిరంతరం విద్యుత్‌ సమస్య వెంటాడుతోంది దీంతో కొన్ని సమయంలో వైద్యం అందించలేని పరిస్థితి వస్తుంది. అలాగే రోగులను ఎక్కించే ర్యాంపు కూడా లేకపోవడంతో ఈ సమస్య కూడా వెంటాడుతుంది. 23 మంది వైద్యులు ఉండాల్సి ఉంది 20 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సిఎస్‌ ఆర్‌ఎంఒ, సిఐఎస్‌ జనరల్‌ మెడిసిన్‌ లేరు. మరొకరు సెలవులో ఉన్నారు. ఎక్స్‌రే టెక్నీషియన్‌ పోస్టులు మూడు ఖాళీలున్నాయి. దీంతో రోగులకు సకాలంలో ఆ పని నెమ్మదిగా జరుగుతుంది. దీనిపై అధికారులు దృష్టి సారించి వెంటనే ఆ సమస్యలు తీర్చి రోగులకు వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు.30 పడకలు వాస్తవమేస్థానిక ఏరియా ఆసుపత్రిలో 30 పడకలే ఉన్నాయి. అయితే ఎన్‌ఆర్‌సి నుంచి 10, హెచ్‌డియు నుంచి నాలుగు పడకలు ఉన్నాయి. రోగులు ఇబ్బందులు పడకుండా వీటిని ఏర్పాటు చేశాం. భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఆసుపత్రి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయితే ఎక్కువ మందికి రోగులకు వైద్యం అందించడానికి కృషి చేస్తాం. ల్యాబ్‌ కొరత లేదు. మందుల నిధులు కొరత లేదు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్‌,ఏరియా ఆసుపత్రి సీతంపేట.

➡️