పేర్నమిట్టలో ఆటల పోటీలు

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట గ్రామంలో 42వ రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డి, జెడ్పిటిసి దుంపా రమణమ్మ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో దుంపా యలమందరెడ్డి, నూకతోటి మస్తానమ్మ, జిల్లా ఎస్సీపిడి అసోసియేషన్‌ నత్తల కృష్ణ, జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కొల్లా నారాయణరావు, ప్రకాశం జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం రత్నకుమార్‌, రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జోసెఫ్‌, వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెచ్‌ఎం వి పార్వతిశాంతి పర్యవేక్షించారు. గ్రామపెద్దలు, విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ జిల్లాల సెక్రటరీలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️