పొగాకు రైతులకు మెరుగైన సేవలు

Nov 29,2023 20:28
మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌

మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌
పొగాకు రైతులకు మెరుగైన సేవలు
ప్రజాశక్తి-కందుకూరు : పొగాకు బోర్డు ఛైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ , రీజినల్‌ మేనేజర్‌ దామోదర్‌తో కలిసి కందుకూరులోని పామూరు రోడ్డులో ఉన్న పొగాకు బోర్డు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ కుమార్‌ 2వ వేల కేంద్రాల సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. బోర్డు సిబ్బంది నిబద్ధత, నిజాయితీ తో పని చేసి రైతుల మన్ననలు పొందాలని తెలిపారు. రైతులు బావుంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. సిబ్బంది ఎప్పటి కప్పుడు సమాచారాన్ని , నూతన టెక్నాలజీ నీ రైతు లకు చేరవేయలని సూచించారు. అనంతరం రెండు వేలం కేంద్రాల రైతులు, రైతు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో సంభాషించారు. ఇందులో వారు రైతు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రెండు వేలం కేంద్రాల అధికారులు, రైతులు పాల్గొన్నారు

➡️