పోగొట్టుకున్న మొబైల్స్‌ బాధితులకు అందజేత

Jan 25,2024 20:12

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 139 మొబైల్స్ను ట్రేస్‌ చేసి, వాటిని డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు గురువారం తమ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ – సైబరు సెల్‌ పోలీసులకు వచ్చిన ఫిర్యాదులఆధారంగా పోయిన మొబైళ్లను ట్రేస్‌ చేసేందుకు సైబరు సెల్‌ పోలీసులు, సిబ్బంది నిరంతరం చర్యలు చేపడుతున్నారన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల గురించి ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే సైబర్‌ సెల్‌ పోలీసులు 139 మొబైల్‌ ఫోన్లను ట్రేస్‌ చేసారన్నారు. ఈఫోన్లను ఎస్‌పి ఆదేశాలతో బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబర్‌ సెల్‌ ఎస్‌ఐలు ప్రశాంత కుమార్‌, నజీమా బేగం, సైబర్‌ సెల్‌ కానిస్టేబుళ్లు వాసుదేవ్‌,శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️